MLA కూతురు ప్రేమ పెండ్లి: నాన్నా మీ ఆలోచన మారాలి

దళితున్ని ప్రేమించి పెండ్లి చేసుకున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కూతురు.. తన తండ్రి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని కోరింది. ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా దళితుడైన అజితేష్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. తమకు తన తండ్రి మనుషులనుంచి ప్రాణ హాని ఉందని.. తమకు రక్షణ కల్పించాలని రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా పోలీసులను కోరింది సాక్షి మిశ్రా. అయితే… ఈ రోజు  నేషనల్ మీడియాలో మాట్లాడిన సాక్షి.. తన తండ్రి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని కోరింది. తన అభిప్రాయాలను తన తండ్రి ఎప్పుడూ విలువ ఇవ్వలేదని తెలిపింది. ఎప్పటికీ తన అన్న అయిన విక్కీకే విలువ ఇచ్చేవారని చెప్పింది.

“నాన్న నీవు ఇంట్లో లేనప్పుడు అమ్మ, విక్కీ నన్ను చాలా బాధపెట్టేవారు. విక్కీ నన్ను అనరాని మాటలతో హింసించేవాడు. నాకు ఇంట్లో స్వేచ్చలేకుండా పోయింది. మీరు నన్ను పట్టించుకోలేదు. నాకు చదువంటే ఇష్టం. నేను మీ ఆఫీస్ లో పనిచేద్దామనుకున్నా అది మీకు చెప్పాను కూడా.. అయినా మీరు నా మాటను పెడచెవిన పెట్టారు. మీరు నన్ను చదివించిన కాలేజీలో కనీసం మొబైల్ కూడా అనుమతి నివ్వలేదు. ఆ రిస్టిక్షన్స్ ను నేను తట్టుకోలేక పోయా.. నాన్నా నేను స్వేచ్చగా ఉండాలనుకున్నా.. గౌరవంగా జీవించాలనుకున్నా.. కానీ మీరు నామాటకు విలువివ్వలేదు.. అమ్మాయిలు ప్రతీ రంగంలో రాణిస్తారు.. మీరు మీ ఆలోచనను మార్చుకోవాలి” అని నేషనల్ మీడియాలో మాట్లాడింది సాక్షి మిశ్రా.

మీడియాలో సాక్షి మాట్లాడుతున్నప్పుడు రాజేశ్ మిశ్రా లైన్ లోకి వచ్చారు. ఫోన్ ద్వారా చానల్ ప్రతినిధులతో, సాక్షితో మాట్లాడారు. సాక్షి పెళ్లిని మీరు ఒప్పుకుంటారా అని మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సాక్షికే బదులిచ్చారు రాజేశ్ మిశ్రా. నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

Latest Updates