టాయిలెట్లు పనిచేయవు గానీ మీ బొమ్మలు పెట్టుకుంటారా?

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులపై ఉన్న టీఆర్ఎస్ యాడ్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను తమవైపుకు తిప్పుకొని సమయం ఇవ్వకుండా టెండర్లన్నీ ఎలా ఖరారు చేశారని ప్రశ్నించారు. తమకు సమయమిస్తే టీఆర్ఎస్ కంటే పదిరేట్లు ఎక్కువ ఇచ్చి యాడ్స్ తీసుకునేవాళ్లమని అన్నారు.

నగరంలో ఎక్కడ చూసిన టీఆర్ఎస్ యాడ్సే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు ఇతర పార్టీలకు దక్కకుండా నైటుకు నైటు కుమ్మక్కై అన్నీ టీఆర్ఎస్ పార్టీ యాడ్స్ ను డిస్ ప్లే చేస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. బస్టాండ్లు, మెట్రోపిల్లర్లు, పబ్లిక్ టాయిలెట్లపై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే ఉన్నాయన్నారు. టాయిలెట్లు పనిచేయవు గానీ మీ బొమ్మలు పెట్టుకుంటారా? అని కేసీఆర్, కేటీఆర్ లను ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని, నగరంలో ఎక్కడ టీఆర్ఎస్ యాడ్స్ కనిపించినా తొలగించాలని బీజేపీ ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు.

Latest Updates