బెంగాల్ ఘర్షణలో బీజేపీ ఎంపీ తలకు గాయం

పోలీస్ కమిషనర్ లాఠీతో కొట్టాడు

ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపణ

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణాస్ లోని శ్యామ్ నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపైనా దాడి జరిగింది. ఈ దాడిలో… ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

టీఎంసీ కార్యకర్తలు… బీజేపీ ఆఫీస్ ను ముట్టడించడానికి వచ్చారు. ఆ సమయానికి నేను కారులో అక్కడికి వచ్చాను. కానీ.. తృణమూల్ పార్టీ కార్యకర్తలు నా కారును కూడా వదల్లేదు. కారుపై దాడిచేశారు. కారులోంచి దిగిన నన్ను కూడా కొట్టారు. పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ నా తలపై లాఠీతో కొట్టాడు. నన్ను బూతులు తిట్టాడు. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న నా ఇల్లుపైనా దాడి జరిగింది” అని తలకు కట్టుతో.. ఒంటిపై రక్తగాయాలతో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ చెప్పారు.

 

Latest Updates