హరీష్ రావ్‌ది చిల్లరబతుకు.. ఆయన కేసీఆర్‌కు గుమాస్తా

హరీష్ రావ్ సీఎం కేసీఆర్‌కు గుమాస్తా

రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులో లేనే లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. మోటార్లకు కరెంట్ మీటర్లు పెడుతున్నారని సీఎం కేసీఆర్, హరీష్ రావ్‌లు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నరని ఆయన అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ఆయన తోగుట మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టే ఆలోచనే లేదు. బిల్లు అలా లేదని ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్దం. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా హరీష్ రావు? మంత్రి హరీష్ రావ్ సీఎం కేసీఆర్‌కు గుమాస్తా. హరీష్ రావ్‌ది చిల్లరబతుకు. చిల్లర పైసల కోసం తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మక్కల కొనుగోలు కేంద్రాలను ముందే ఎందుకు పెట్టలేదు? రైతులు మక్కలు సగం ధరకు అమ్మకున్నాక.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అంటున్నారు. బీజేపీ నేతలపై అడ్డగోలుగా కామెంట్స్ చేస్తే జరాసంధుడిని చీరినట్టు చీరుతా’ అని ఎంపీ అర్వింద్ హెచ్చరించారు.

For More News..

బైకర్స్‌కి వార్నింగ్.. స్టంట్స్ చేస్తే రూ. 2 లక్షల జరిమానా

గ్యాంగ్ రేప్ శిక్షపై కర్ణాటక హైకోర్టు కీలక వాఖ్యలు

దేశంలో కొత్తగా 43,893 కరోనా కేసులు

Latest Updates