‘మా కార్పొరేటర్లను డిస్ట్రబ్ చేస్తే.. మేం మీ కార్పొరేట్ వరల్డ్‌ని డిస్ట్రబ్ చేస్తం’

ధర్మపురి అర్వింద్ ప్రెస్‌మీట్

నిజామాబాద్ పరిధిలోని ప్రతిపక్ష నేతలను సీఎం కేసీఆర్ డిస్ట్రబ్ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మా కార్పొరేటర్లను డిస్ట్రబ్ చేస్తే మేం మీ ఎంపీలను డిస్ట్రబ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ శనివారం బంజారాహిల్స్‌లోని ఇన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులను బెదిరించి టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిరాయింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మైం హోమ్ సంస్థలో ఐర్లాండ్ కంపెనీ భాగస్వామిగా ఉందని ఆయన అన్నారు. మైనింగ్‌లో విదేశీ సంస్థలకు అవకాశం ఉండదని ఆయన అన్నారు. ఐర్లాండ్‌ కంపెనీకి 50 శాతం వాటా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ లీజులన్నీ రూల్స్ ప్రకారమే జరగాలని ఆయన అన్నారు. విదేశీ కంపెనీతో కలిసి మైం హోం సంస్థ తీవ్ర మోసాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. మైం హోం సంస్థ అక్రమాలను సీబీఐ బయటపెట్టాలని ఆయన అన్నారు.

For More News..

పాక్ విమాన ప్రమాదం.. ఏటీసీతో పైలట్ చివరి మాటలు

వీడియో: సీసీటీవీలో రికార్డయిన పాక్ విమాన ప్రమాదం

పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

ఆటలో గొడవ.. 8 మంది ఖైదీలు మృతి

Latest Updates