‘కేసీఆర్ త్వరలో ఫామ్ హౌస్ కే పరిమితమవుతారు’

విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీ చార్జి చేశారన్నారు బీజేపీ ఎంపి అర్వింద్. సీఎం కేసీఆర్ సూచన మేరకే బూట్లతో తన్ని, లాఠీ ఛార్జ్ చేశారన్న ఆయన.. జంతువుల మీద కూడా అంత కఠినంగా వ్యవహరించరని అన్నారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు.

విద్యార్థుల వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు అనుభవిస్తున్న పదవులంతా వాళ్ల వల్లేనని అన్నారు ఎంపీ. తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చేసిన విద్యార్ధులను.. సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరించి పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించారన్నారు. విద్యార్థులను తక్కువ అంచనా వేయొద్దని, పోలీసులు లిమిట్ లో పనిచేయాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. స్వంత రాష్ట్రంలో పరాయి పాలనలో ఉన్నట్టుందన్నారు అర్వింద్. ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు రాష్ట్ర బడ్జెట్ ని రూపొందించారని విమర్శించారు. కేసీఆర్ ఒక ఫామ్ హౌస్, కేటీఆర్ కి ఒక ఫామ్ హౌస్, కవితకు ఒక ఫామ్ హౌస్ ఉందన్న ఆయన.. కేసీఆర్ త్వరలో ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని చెప్పారు.

మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కన్నా కేసీఆర్ పెద్ద నాయకుడేం కాదని, జ్యోతిరాధిత్య సింధియా తమ పార్టీలో చేరడం చాలా సoతోషంగా ఉందన్నారు అర్వింద్.

Latest Updates