
అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా అదనపు భూములిచ్చి ప్రోత్సహిస్తున్నారు
కేంద్ర మైనింగ్ శాఖ ఇచ్చిన 3 నోటీసులు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను లేఖకు జత చేసిన ఎంపీ
వెంటనే చర్యలు తీసుకుని లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: మై హోం గ్రూప్ సంస్థ అక్రమాలపై చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ లేఖ రాశారు. రిజర్వు ఫారెస్టులో ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తున్నారని కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖ మూడుసార్లు నోటీసులిస్తే.. అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా అదనంగా మరికొన్ని భూములిచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్ట విరుద్ధంగా రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కేంద్ర మైనింగ్ శాఖ స్వయంగా నోటీసులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరూ చర్యలు తీసుకున్న పాపానపోలేదన్నారు. ఈ మేరకు కేంద్ర మైనింగ్ శాఖ ఇచ్చిన 3 నోటీసులతోపాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఆయన లేఖకు జత చేసి చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు. మైం హోం గ్రూప్ యాజమాన్యం రిజర్వు ఫారెస్టులో చేస్తున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను నిలిపేసేలా తీసుకున్న చర్యలతో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు
.
సీఎస్ సోమేష్ కుమార్ కు రాసిన లేఖ ..