అగ్రికల్చర్ బిల్లు తేనె పూసిన కత్తిలాంటి చట్టమని విమర్శించడం తగదు

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లు తేనే పూసిన కత్తిలాంటి చట్టమని విమర్శించటం అర్థరహితమని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. దేశంలోని గ్రామాలు ,పేద రైతుల సంక్షేమానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని అన్నారు.

రైతులకు పూర్తి ప్రయోజనకారిగా ఉండే చట్టంపై లేని పోనీ అనుమానాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతుల్ని అయోమయానికి గురిచేయడం సమంజసం కాదన్నారు.ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా కేంద్రం ఆధ్వర్యంలో వేల నూతన మార్కెట్లు వస్తున్నాయని సూచించారు. తెలంగాణాలో నిర్మించే రైతు మార్కెట్లకు కేంద్రం నిధుల్ని సమకూరుస్తుందన్నారు.

ఈ సందర్భంగా బండిసంజయ్ మాట్లాడుతూ గత యాసంగిలో వడ్ల కొనుగోలు సంధర్భంగా ఐకే్‌పి కేంద్రాలలో వడగండ్ల వానకు రైతులు నష్టపోయిన విషయం వాస్తవమా కాదా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్ డౌన్ కాలంలో తెలంగాణలో పండ్లుకూరగాయల రైతులుతీవ్రంగా నష్టపోయిన విషయం తెలియదా అని అడిగారు.

ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో రైతులకు వ్యాపారులకు ఎంపిక స్వేచ్ఛతోపాటు పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు వీలున్న వాతావరణాన్ని సృష్టించడమే రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-ప్రధాన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.

Latest Updates