‘అవినీతి ముఖ్యమంత్రి’ పై సర్వే చేస్తే కేసీఆర్‌దే మొదటి స్థానం

తెలంగాణ వచ్చి ఆరు సంవత్సరాలు అయింది.. లక్ష ఉద్యోగాలు వచ్చాయి కానీ ఆఫీస్ లేదు. నిరుద్యోగ భృతి వచ్చింది కానీ వారికి అకౌంట్ లు లేవు. దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చింది కానీ ఏమీ పంట వేయాలో తెలియట్లేదు . దళిత ముఖ్యమంత్రి అయ్యాడు కాని ఎవరో తెలవదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల లూటీ అయింది …అది కనిపించదు” అ‌ని ఆరేళ్ల సీఎం కేసీఆర్ పాల‌న‌పై ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్.

బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పింక్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు అని చెప్పారు ఎంపీ అర‌వింద్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎక్కడ అని ప్ర‌శ్నించారు. జాతీయ మీడియా చేప‌ట్టిన‌ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి 16 స్థానము దక్కిందని, అత్యంత చెత్త ముఖ్యమంత్రి అని నిర్దారణ అయిందని అరవింద్ అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాలుగువ స్థానంలో ఉన్నారన్న ఎంపీ.. అవినీతి ముఖ్యమంత్రిపై సర్వే చేస్తే ముఖ్యమంత్రి కేసీఆరే మొదటి స్థానంలో ఉంటారన్నారు. ఆయన మంత్రి వర్గంలో అంతా తెలంగాణ ద్రోహులేన‌ని అన్నారు

ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేవలం 25000 ఉద్యోగాలు విడుదల చేసారని అర‌వింద్ అన్నారు. ఇప్పటి వరకు మూడు లక్షల మందికి నిరుద్యోగ భృతి లేదని.. కేవలం కేసీఆర్ కుటుంబంలోని వారికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయన్నారు. ప్రజలు తిరస్కరించిన వారు కూడా ఉద్యొగాలు పొందుతున్నారని విమ‌ర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా సహాయం చేస్తున్నా.. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయటం లేదన్నారు. లాక్ డౌన్ లో 1500 రూపాయలు కేంద్రమే ఇచ్చింద‌ని, బియ్యం, పప్పు అన్నీ కూడా కేంద్ర నుంచే అమ‌లవుతున్నాయ‌న్నారు. ఆయుష్మాన్ భవా పథకాన్ని ఎందుకు అమలు చేయటం లేదని ప్ర‌శ్నించారు. ఆ పథకం ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ లో కూడా అవినీతి జ‌రుగుతుంద‌ని …శవాల మీద పేలాలు వేరుకుంటున్నారన్నారు.. మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

BJP MP Dharmapuri Arvind comments on CM KCR's six-year rule

Latest Updates