గౌతమ్ గంభీర్ ఇంట్లో కారు చోరీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నాన్న కారును దొంగలు ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ లోని గంభీర్ ఇంటి బయట ఆయన తండ్రి వాడే ఎస్ యూవీని దొంగలు ఎత్తుకెళ్లారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున జరిగిందని పోలీసులు చెప్పారు. కేసును బుక్ చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి పలు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. డీసీపీ జనరల్ ప్రకారం.. దొంగల కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, గంభీర్ తన తండ్రితో కలసి రాజేంద్రనగర్ లో ఉంటున్నాడు.

Latest Updates