కేసీఆర్ కి త్వరలో కరోనా వస్తది: సోయం

ఆదిలాబాద్ : ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టే టి.ఆర్.ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకుతోంద‌ని, త్వరలోనే సీఎం కేసీఆర్ కి కూడా కరోనా వస్తుంద‌ని అన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపురావ్. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎంపీ తో స‌హా జిల్లా బీజేపీ నేత‌లు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా సోయం మాట్లాడుతూ.. ఆసుప‌త్రి ప‌నుల కోసం కేంద్రం రూ. 120కోట్లు చెల్లించినా.. రాష్ట్రం తన వాటా చెల్లించక పోవడం వల్లే పనులు కొనసాగడం లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలపై కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నాడన్నారు.

క‌‌మీషన్లు రావనే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసిఆర్ నిధులు కేటాయించడం లేదని చెప్పారు. అదిలాబాద్ జిల్లా ప్రజలకు హెలికాఫ్టర్ వైద్యం అందిస్తానన్న కేసిఆర్ మాటలు ఎటుపోయాయని ప్ర‌శ్నించారు. దగుల్భాజీ మాటలతో సీఎం ప్రజలను ఆగం పట్టిస్తున్నాడని సోయం బాపురావ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

BJP MP Soyam Bapurao comments on CM KCR over rims hospital works

Latest Updates