పాక్ ను 4 ముక్కలు చేయగలం.. కానీ: సుబ్రమణ్య స్వామి

Bjp MP subramanian swami warns Pakisthan
  • ఉగ్ర మూకల్నే తుడిచి పెట్టాం.. ఇకనైనా సారీ చెప్పండి
  • లేదంటే పాకిస్థాన్ కి సైన్యం బుద్ధి చెబుతుంది: బీజేపీ ఎంపీ

Bjp MP subramanian swami warns Pakisthanభారత్ తలుకుకుంటే పాక్ ను నాలుగు ముక్కలు చేయగలదని, కానీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత వాయుసేన దాడి చేసిందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలిపారు. ఉగ్రవాదాన్ని పోత్సాహించొద్దన్ని పాక్ ని హెచ్చరించడానికే ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు చెప్పారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత్ మొత్తం ఆగ్రహంతో ఉందన్నారు. దానికి ప్రతిఫలమే నిన్న ఐఏఎఫ్ చేసిన దాడి అని చెప్పారు. ఈ సమయంలో పాక్ పౌరులపై దాడి చేయలేదని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకోవాలని స్వామి అన్నారు. ఇప్పటికైనా తప్పయిపోయిందని సారీ చెప్పి పాకిస్థాన్ ముందుకొస్తే సరే, లేదా ప్రతీకార దాడి అంటే మాత్రం ఏం చేయాలో భారత సేనలకు తెలుసన్నారు. అన్నింటికీ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ను హెచ్చరించారు. భారత్ తలుచుకుంటే పాక్ ను నాలుగు ముక్కలుగా చేసేస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాక్ ను సమర్థించదని చెప్పారు.

Latest Updates