నా ప్రభుత్వం కూల్చాలని చూస్తున్నారు: బీజేపీపై అశోక్‌గెహ్లాట్‌ ఫైర్‌‌

  • ఒక్కో ఎమ్మెల్యేకి 15 కోట్లు ఆఫర్‌‌ చేస్తున్నరు

జైపూర్‌‌: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్‌ గేమ్స్‌ ఆడుతోందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్‌‌ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషీ ఎస్‌వోజీ, ఏసీబీ ఆఫ్‌ రాజస్థాన్‌ పోలీస్‌కి కంప్లైంట్‌ చేశారు. “ దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు అన్నీ బయటపడతాయి” అని జోషీ అన్నారు. కాగా.. దక్షిణ రాజస్థాన్‌కు చెందిన ఎమ్మెల్యే కుశాల్‌ను బీజేపీని సంప్రదించిందని ఆరోపణలు రాగా.. ఆయన వాటిని ఖండించారు. “ ఎలాంటి ప్రలోభాలను ఇవ్వడం ద్వారా ఎవరూ తమ సమగ్రతను కదిలించలేరని, రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుంది” అని 24 మంది ఎమ్మెల్యేలు స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. తమను ఎవరూ కొనలేరని అన్నారు. రాజ్యసభ ఎలక్షన్స్‌ టైమ్‌లో కూడా ఎమ్మెల్యేలను కొనాలని చూశారని జోషీ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ 170 సీట్లు గెలుచుకుంది. దాంతో పాటు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Latest Updates