అమిత్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..వాహనాలకు నిప్పు

కోల్ కతాలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన రోడ్ షో హింసాత్మకంగా మారింది.రోడ్ షో జరుగుతుండగా అమిత్ షా కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో బీజేపీ నేతలు  ఆగ్రహంతో అక్కడున్న వాహనాలకు నిప్పంటించారు.  బీజేపీ, తృణముల్  కాంగ్రెస్  వర్గాలు  కర్రలతో కొట్టుకున్నారు. రాళ్ల దాడి చేసుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలపై లాఠీ ఛార్జ్ చేశారు.  ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు అమిత్ షా.

Latest Updates