మీడియా ప్రతినిధులకు సెల్యూట్: జేపీ నడ్డా

  • వరల్డ్ ప్రెస్ డే గ్రీటింగ్స్ చెప్పిన బీజేపీ చీఫ్​

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియా.. పారదర్శకంగా అభిప్రాయాలను రూపొందించడం, ప్రజలకు సమాచారం చేరవేయడంలో కృషి చేస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుత కరోనా కష్ట కాలంలోనూ ప్రజలకు అవగాహన కల్పించడంలో దేశంలో మీడియా గొప్ప పాత్ర పోషిస్తోందన్నారు. ఇలాంటి సందర్భంలో మీడియా మిత్రులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని కొనియాడారు. ‘‘కరోనాకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలకు తెలిసేలా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నందుకు మీడియా ప్రతినిధులకు సెల్యూట్” అని నడ్డా ట్వీట్ చేశారు.

Latest Updates