పోలీస్ వాహనాల్లో డబ్బులు పంచేందుకు టీఆర్ఎస్ ప్లాన్

ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ వాళ్లు పోలీస్ వాహనాల్లో డబ్బులు పంచేందుకు ప్లాన్ చేస్తున్నరని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీల ప్రచారాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భూంపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఎమ్మెల్యేను చేస్తే.. భూంపల్లిని మండల కేంద్రంగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘నన్ను ఎమ్మెల్యేను చేస్తే దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి గ్రామాన్ని ఏడాదిలోగా మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తా. అలా చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్న. టీఆర్ఎస్ వాళ్లు పోలీసోళ్ల బండ్లలో డబ్బులు పంచేందుకు సిద్దం అయ్యారు. ఇవ్వాలో.. రేపో డబ్బులు పంచే ప్లాన్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేయండి. ఆ డబ్బులు ప్రజలవే. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లనే అభివృద్ధి చేసుకుంటున్నారు. సిద్దిపేట-దుబ్బాక రెండు కళ్లు అని టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు అబద్ధాలు చెబుతున్నరు. దుబ్బాక ప్రజలు నమ్మొద్దు. దుబ్బాకను పట్టించుకోవడం లేదు. కాబట్టి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి.. దుబ్బాక అభివృద్ధిలో పాలుపంచుకోండి’ అని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.

For More News..

క్రైమ్ పెట్రోల్‌ వీడియోలు 100సార్లు చూసి తండ్రిని చంపిన మైనర్ బాలుడు

నాకు తోడుగా రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే అయ్యాకొడుకులను ఓ ఆట ఆడుకుంటాం

నేటి నుంచి భారత్‌లో పబ్జీ బంద్

14 ఏళ్లకే గర్భం.. సీక్రెట్‌గా డెలివరీ.. పేరెంట్స్‌కు భయపడి శిశువును ఫ్రీజర్‌లో దాచిన బాలిక

Latest Updates