ఏపీకి మూడు రాజధానులు అవసరమా: రాంమాధవ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్  ఆంధ్రప్రదేశ్ కు  మూడు రాజధానులు అవసరమా? అని అన్నారు. అంతేకాదు.. రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. టీడీపీ హయాంలో అమరావతిలో జరిగిన అవినీతిని ప్రశ్నించామని… ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ పోరాడాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉందని… ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అంటూ ప్రశ్నించారు.

Latest Updates