ఐదేళ్ల పాలన.. ఐదు చెత్త పనులు: అహ్మద్ పటేల్ ట్వీట్

న్యూఢిల్లీ: మోడీ ఐదేళ్ల పాలన ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. ఐదు చెత్త పనుల వల్ల 16వ లోక్ సభ ఐదేళ్ల కాలం గుర్తుండిపోతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐదు కారణాలను ప్రస్తావిస్తూ ఈ ఐదేళ్ల పాలన ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా గుర్తుండిపోతుందన్నారు. 16వ లోక్ సభ ముగుస్తున్న ఈ సమయంలో వాటిని గుర్తు చేస్తున్నానని అన్నారు.  17వ లోక్ సభ కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తుందని, అప్పుడు ఈ తరహా అప్రజాస్వామిక విధానాలకు చోటు ఉండదని అన్నారు.

 

ఆ ఐదు పనులు

  • పార్లమెంటరీ కమిటీల నిర్వీర్యం.
  • పార్లమెంటు సెషన్స్ తేదీలను ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి అనుగుణంగా సెట్ చేసుకోవడం.
  • సాధారణ బిల్లులను కూడా ఆర్థిక బిల్లులుగా చర్చకు పెట్టడం.
  • సభ కార్యకలాపాలకు ట్రెజరీ ఆటంకం కలిగించడం
  • పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, నిరసన తెలిపిన ప్రతిపక్ష సభ్యులను ఇష్టానికి సస్పెండ్ చేయడం

Latest Updates