మోడీ ముందే నన్ను అవమానించారు

కోల్‌‌కతా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పేరును భారత్ జలావో పార్టీగా మార్చాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రీసెంట్‌‌గా కోల్‌‌కతాలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాల్లో తనకు జరిగిన అవమానంపై మమత ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాను మాట్లాడటానికి వెళ్తున్న సమయంలో జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించినా ఫర్వాలేదని.. కానీ బెంగాల్‌‌ను అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

‘ఎవరైనా అతిథిని ఇంటికి పిలిచి అవమానిస్తారా? ఇదేనా మన దేశ సంస్కృతి? నేతాజీ పేరిట స్లోగన్స్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ వాళ్లు (బీజేపీ నేతలు) వేరే నినాదాలు చేశారు. నన్ను తిట్టడం కోసం కార్యక్రమంతో సంబంధం లేకుండా స్లోగన్స్‌‌తో అరిచారు. ఈ దేశ ప్రధాని ముందు నన్ను అవమానించారు. ఇదే బీజేపీ కల్చర్’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Latest Updates