దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా

దోచుకోవడం, దాచుకోవడమే సీఎం కేసీఆర్ ఎజెండా అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగ నిర్వహించాలని 30ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే సెప్టెంబరు 17 ను అధికారికంగ జరుపుతామని చెప్పిన కేసిఆర్ ఇప్పుడు ఎందుకు జరపడం లేదో చెప్పాలన్నారు.  మజ్లీస్ కు భయపడే కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదన్నారు. కేసిఆర్ దౌర్భాగ్య ముఖ్యమంత్రి అని..నిజాం ఏవిధంగ గొప్పవాడో కేసిఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ నిజాం సమాధి వద్ద మోకరిల్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండన్నారు.  కేసిఆర్ పేద ప్రజల రక్తం పీల్చుతు రాజ్యాం ఏలుతున్నాడన్నారు.

కోవిడ్ కట్టడి కోసం కేంద్రం రూ.7 వేల కోట్లు పంపితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. ప్రజలు చైతన్యం అయి కేసిఆర్ ను గద్దె దించాలన్నారు.  సింగరేణి ఎన్నికల్లో టీబీజీకెఎస్ ను ఓడించి బీఎంఎస్ ను గెలిపించి కేసిఆర్ కు దిమ్మతిరిగేలా చెయ్యాలన్నారు. 2023 లో గోల్కొండ ఖిల్లాపై  అసెంబ్లీలో ఎగిరెది కాషాయం జెండాయేనన్నారు.

సీఎం కేసిఆర్ అబద్దాల కోరు: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికులకు లాభాల్లో రావాల్సిన వాటా ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారన్నాన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాబోయే సింగరేణి ఎన్నికల్లో గెలవడానికి కేసిఆర్ మళ్లీ అబద్దాలు ఆడతాడన్నారు. కేసిఆర్ కు పీవీ అంటే అభిమానం లేదని.. జాతీయ రాజకీయాల కోసమే ఆయన పేరును వాడుకుంటున్నాడన్నారు.  కేసిఆర్ సీఎం కదా..? తెలంగాణ వచ్చాక పీవీ పేరును ఎందుకు యూనివర్సీటీలకు పెట్టలేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇవ్వడానికి సిద్దంగ ఉందన్నారు.

Latest Updates