సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం

మఫ్లీలో వచ్చి పోలీసులు రఘునందన్ బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే..సిద్దిపేటలో తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బైపోల్ లో గెలిచి సత్తా చూపిస్తామన్నారు బండి. సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్య అని సీరియస్ అయ్యారు బండి సంజయ్.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నివాసంతో పాటు కార్యాలయం, ఆయన బంధువు ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇంటి ముందే బైఠాయించి రఘునందన్ తన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.

Latest Updates