కేసీఆర్ దోపిడి.. మందుకు, స్టఫ్ కు కూడా సింగరేణి పైసలే

టీఆర్ఎస్ కు ఫైనాన్స్ సోర్స్ గా సింగరేణి మారిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సింగరేణి సొమ్మును కేసిఆర్ అక్రమంగా వాడుకుంటున్నాడన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ అవినీతి మీద విచారణ జరపించి జైలుకు పంపిస్తామన్నారు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ సింగరేణి సంస్థను దోచుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్  పార్టీ మీటింగులకు, కేసీఆర్ మందుకు, సోడా, చికెన్ స్టఫ్ కు కూడా సింగరేణి పైసలే పెడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. సింగరేణి సిఎండి.. కేసీఆర్ చెప్పుచేతుల్లో పనిచేస్తున్నాడని…. ఐఎఎస్ కాదు అయ్యా ఎస్ అంటున్నారన్నారు. సింగరేణిలో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని… వచ్చే ఎన్నికల్లో సింగరేణి గడ్డపై కాషాయ జెండా ఎగురేస్తామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు.

అమ్మకు ఏం ఇష్టమో తెలుసా?.. ముంబై పోలీసుల ట్వీట్

Latest Updates