టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటెయ్యండి

టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని బిజెపికి ఓటు వేయాలన్నారు ఆ పార్టీ  స్టేట్ చీఫ్ బండి సంజయ్. నిజామాబాద్ ,కరీంనగర్,అదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఏం జరిగిందో దుబ్బాక నియోజకవర్గంలో అదే రీపీట్ కాబోతుందన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ తీరుతో పోలీసుల అమరవీరుల అత్మఘోషిస్తుందన్నారు.  రైతుల మోటార్లకు మీటర్టు పెట్టబోయేది కేసీఆర్ అని.. బీజేపీ కాదన్నారు. రైతులకు ఉచిత కరెంట్ తీసివేయాలని కేసీఆర్ చూస్తున్నాడన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వకుంటే రైతులు కేసీఆర్ ను ఉరికించి కొడతారన్నారు. తెలంగాణ కు చెందిన రూ. 20 వేల కోట్ల కరెంట్ బిల్లులు మోడీ కట్టారని.. కేసీఆర్ కరెంట్ వాళ్ళకు బిల్లులు కట్టడం లేదన్నారు. సన్న వడ్లు వేసుకొమ్మని  రైతులకు  చెప్పిన కేసీఆర్  తాను దొడ్డు వడ్లు వేసుకున్నాడన్నారు.

కేంద్రం నిధులు ఇవ్వటం లేదన్న కేసీఆర్.. ఆధారాలతో సహా నిరుపిస్తామన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే కేసీఆర్ ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్ ల ఆగుతాయని టీఆర్ఎస్ వాళ్లు బెదిరిస్తున్నారన్నారు.  కవితను ఓడ గొట్టిన నిజామాబాద్ లో పెన్షన్ లు ఆగాయన్నారు. దుబ్బాక ఉపఎన్నికతో యువత అంటే ఏంటో కేసీఆర్ కు  తెలిసేలా చేయాలన్నారు

 

Latest Updates