ఉస్మానియాలో శ్రీనివాస్ ను పరామర్శించిన బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేసిన శ్రీనివాస్ ను ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి  పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అందుబాటులో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్ర రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులతో కలసి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ను పరామర్శించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం బాధాకరం అన్నారు. పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా శ్రీనివాస్ పనిచేస్తున్నాడని గుర్తు చేసుకున్నారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఇప్పుడేమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని,  శ్రీనివాస్ కు 58 శాతంకు పైగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారని బండి సంజయ్ వివరించారు. శ్రీనివాస్ కు మైరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు.. ప్రశ్నించే వారిపై  ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి.. జైళ్లకు పంపుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దైర్యంగా పోరాడుదాం..  బీజేపీ కార్యకర్తలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించే వరకు కష్టపడి పనిచేద్దామని బండి సంజయ్ కోరారు.

For more news..

పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. యూకేలో మళ్లీ లాక్‌‌డౌన్

మరుగుదొడ్డి కట్టించి ఉదారతను చాటుకున్న పోలీస్

భిక్షమెత్తుతూ ఐదు బిల్డింగులు, రూ.కోటికి పైగా సంపాదన

Latest Updates