కాళేశ్వరం టెండర్లపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీకి టెండర్లు పిలవడంపై  శనివారం… రాజ్ భవన్ లో గవర్నర్ కు ఫిర్యాదు  చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. సాగునీటి ప్రాజెక్టులలో  టీఆర్ఎస్  ప్రభుత్వం  పెద్ద ఎత్తున  అవినీతికి పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచారని,  కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే టెండర్లు పిలిచారని ఆరోపించారు. ప్రాజెక్టులపై విచారణ జరిపించి  …  దోపిడీని అరికట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు  బీజేపీ నేతలు. గవర్నర్ ను కలిసినవారిలో బండి సంజయ్‌, వివేక్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి తదితర బీజేపీ నేతలు ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates