ఉద్యమ ద్రోహులతో బంగారు తెలంగాణ సాధ్యం కాదు

తెలంగాణ చరిత్ర అంటే కేవలం కేసీఆర్ చరిత్రే అనే రీతిలో ముఖ్య‌మంత్రి భవిష్యత్తు తరాలను మాయ చేసే కుట్ర పన్నుతున్నాడ‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్. ఉద్యమ ద్రోహులను పక్కనబెట్టుకొని పరిపాలన చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్ర‌శ్నించారు. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు సంజ‌య్ నేడు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజ‌పేట మండ‌లంలోని రేణుగుంటలో ప‌ర్య‌టించారు. రేణుగుంట‌లో తెలంగాణ పోరాటవీరుడు చింతలపూడి రామ్ రెడ్డి కుటుంబాన్ని కలిసి వారితో ముచ్చటించి సన్మానం చేశారు సంజయ్. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులను నట్టేటముంచిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని అన్నారు.

మెడకాయ మీద తలకాయ ఉన్నంతవరకు అబద్ధం ఆడనని చెప్పిన కేసీఆర్.. ప‌చ్చి అబ‌ద్దాల కోరు అని అన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం విషయంలో అబద్ధం ఆడిన కెసిఆర్ కు మెడకాయ మీద తలకాయ లేదా అని ప్ర‌శ్నించారు.

Latest Updates