ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం ప్రభుత్వమే: లక్ష్మణ్

తెలంగాణ  సాధన  కోసం  పోరాడిన  ఆర్టీసీ కార్మికుల జీవితాలు ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారాయన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.  ప్రైవేట్ సంస్థలు కోట్లు గడిస్తుంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రతి అంశాన్ని పొరుగురాష్ట్రంతో పోల్చే కేసీఆర్ కు.. ఏపీ ఆర్టీసీలో జరుగుతున్న సంస్కరణలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లో కురుకుపోయేలా చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ లోపాలు సరిదిద్ది గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం బీజేపీ పోరాడుతుందన్నారు లక్ష్మణ్.

Latest Updates