ఆప్, కాంగ్రెస్ ఒక్కటైనా మేం పుంజుకున్నం

ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ భారీగా పుంజుకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. 2015 ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన బీజేపీ ఇపుడు ఐదు రెట్లు పుంజుకుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ కాలక్రమేనా ప్రాంతీయ పార్టీగా మారుతుందన్నారు.  స్థానికంగా ఉండే ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆప్ లాంటి పార్టీలు ప్రజల మద్దతు పొందుతున్నాయన్నారు.

సీఏఏకు మద్దతుగా త్వరలో హైదరాబాద్ లో అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.  2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు.  జాతీయవాదులంతా పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా ఏకమవుతున్నారు.
సీఏఏ  ఏ ఒక్క మతానికి, కులానికి, వర్గానికి వ్యతిరేకం కాకపోయినప్పటికీ కొన్ని పార్టీలు విషప్రచారం చేస్తున్నాయన్నారు. కొన్ని పార్టీలు కావాలని విషప్రచారం చేస్తున్నా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు.

Latest Updates