యాదాద్రి కంటే అక్కడి రియల్ ఎస్టేట్ పైనే కేసీఆర్ దృష్టి

సీఎం కేసీఆర్ కు యాదాద్రి అభివృద్ధి కంటే రియల్  ఎస్టేట్ పైనే మక్కువన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకుని కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.  కేసీఆర్ ఒక గజినిలా తయారయ్యారని..హిందూమత సంప్రదాయాలను మట్టికరిపిస్తున్నారని విమర్శించారు. ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్ ను పెట్టి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారన్నారు. యదాద్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని..కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని అన్నారు. ఆగమ శాస్త్రం అనుగుణంగా ఆలయ నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Latest Updates