కేసీఆర్ శంకర్ దాదా MBBS లాగా మాట్లాడుతున్నారు

తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలతో కూడిన మోసపూరిత బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బడ్జెట్ పై సోమవారం మీడియాతో మాట్లాడుతూ..  ఆర్థిక లోటును ఎలా పూడ్చుతారో కూడా అధికార నేతలు చెప్పలేదన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదని, సీఎం కేసీఆర్  చెప్పిన ‘సామాజిక విలువల స్వరూపం.. బడ్జెట్ ‘ అన్న మాటలకు సత్య దూరంలో బడ్జెట్ ఉందని అన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఎన్ని గ్రామాలకు నీరిచ్చారో చెప్పాలని, లబ్దిదారులకు ఇచ్చిన ఇండ్లు ఎన్నో లెక్క చెప్పాలన్నారు లక్ష్మణ్. విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. సిబ్బంది లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. సాగునీటి రంగానికి అరకొర నిధులే కేటాయించారని లక్ష్మణ్ విమర్శించారు. ఉధ్యమ సమయంలో నిరుద్యోగులను, యువకులను వాడుకొని దారుణంగా మోసం చేసారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక మందగమనానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని అన్నారు. ఆర్థిక మాంద్యం ఉంటే రెండంకెల వృద్ధి రేటు ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పులు చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని,  తెలంగాణలో హైదరాబాద్ ప్రజలు కడుతున్న పన్నులు ఎటుపోతున్నాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. బడ్జెట్ నిధుల విషయంలో కేసీఆర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా మాట్లాడుతున్నారన్నారు.

bjp state president laxman comments on budget to the media

Latest Updates