తోటి ఉద్యోగుల కడుపు కొట్టి సీఎంతో విందులు చేశారు

ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న నేతలు సాధారణ ఉద్యోగులను ఫణంగా పెట్టి మంత్రి పదవులు కూడా పొందారన్నారు. మంత్రి పదవి పొందిన ఆ నేత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన కారణంగా ఏపీలోనే ఉండి పోయిన తెలంగాణ కు చెందిన గ్రూప్ 4 ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకరాలేక పోయారన్నారు.

కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు సాధారణ ఉద్యోగులు ఇంకా తమతోనే ఉన్నారని అనుకుంటున్నారని, ఆర్టీసీ సమ్మె ను నిర్వీర్యం చేసేందుకు ఆ ఉద్యోగ సంఘాల నేతలు కేసిఆర్ కు సహకరించారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కడుపు కొట్టి , వారంతా సీఎం క్యాంప్ ఆఫీసు కు వెళ్లి భోజనం చేశారని, ఆ సంఘాల అసలు స్వరూపం ఇదని అన్నారు.

 

 

Latest Updates