సొంతవారికి కట్టబెట్టేందుకే…. కేసీఆర్ ఆర్టీసీని ముంచుతున్నరు..!

ఆర్టీసీకి చెందిన 80 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సొంతవారికి కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ తమిళిసైని కలిసిన తర్వాత లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ హాస్పిటల్ లో కార్మికులకు వైద్యం నిరాకరించడం బాధాకరమన్నారు. కార్మికుల ఇబ్బందులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును  గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు లక్ష్మణ్.

Latest Updates