సీఎం కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగం

సీఎం కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగమ‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్.

క‌రోనా పై స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న ప‌లు అంశాల‌పై ప్ర‌స్తావించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క‌రోనా వ‌చ్చిందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, అందులో వాస్త‌వం లేద‌ని అన్నారు.కేసీఆర్ అసమర్థత పై రాయండి…మానవత్వం లేని మానవ మృగంగా వ్యవహరిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గాంధీ హాస్పిటల్లో 100 బెడ్స్ కి మాత్రమే ఆక్సిజన్ ఇచ్చే వసతి ఉందని..అలాంటిది 250 బెడ్స్ కి ఆక్సిజ‌న్ ఎలా ఇస్తార‌ని బండి సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింద‌న్న ఆయ‌న .. ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేసే ఉద్యోగులు సైతం కార్పోరేట్ ఆసుపత్రి లో జాయిన్ అవుతున్నార‌ని చెప్పారు. వాళ్ళకి భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని, వాళ్ల జీతాలు ఎందుకు పెంచడం లేదని అడిగారు.

కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని జేబులో వేసుకున్న కేసీఆర్ ..డ‌బ్బుల క‌క్కుర్తితో డాక్టర్ల కు నాసిరకం పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్క్ లు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం సీఎం కేసీఆరేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ఫాం హౌస్ లో డాక్టర్ల పర్యవేక్షణ లో ఉన్నార‌న్న బండిసంజ‌య్ ..గవర్నర్ మాటలకు సీఎం గౌరవం ఇవ్వరు..దొంగ లెక్కలను గుర్తించి హైకోర్టు సీరియస్ అయింది.. హెల్త్ బులెటిన్ సమగ్రంగా ఉండడం లేదు. మరణాల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పడం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చాల‌న్న ఆయ‌న .. కేసీఆర్, ఈటెల మధ్య ఉన్న విభేదాలు ఈ పరిస్థితి కి కారణమ‌న్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించండి.. అవసరం ఉంటేనే బయటకు రండి..సీఎం కేసీఆర్ మాటలు నమ్మి బయటకు వస్తే మన ప్రాణాలకే ముప్పని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చెప్పారు.

Latest Updates