ప్రియాంక గాంధీ ర్యాలీలో గజ్వేల్ జనం… బీజేపీ కౌంటర్

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, తూర్పు యూపీ ఇంచార్జ్ ప్రియాంకగాంధీ లక్నో నగరంలో పాల్గొన్న భారీ ర్యాలీపై కాంగ్రెస్, బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రియాంక గాంధీకి అద్భుతమైన స్వాగతం లభించింది అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఏఐసీసీ కమ్యూనికేషన్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ పై కర్ణాటక బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ కౌంటర్ చేసింది. గజ్వేల్ లో ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సభకు హాజరైన జనం ఫొటోను పెట్టారని.. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. వాళ్లు దోచుకున్నారు.. అబద్దాలు చెప్పారు… ఇపుడు ఫొటోషాప్ చేసి జిమ్మిక్కు చేస్తున్నారని విమర్శించింది. మోసపూరిత ఫొటోలతో కాంగ్రెస్ 2019 ఎన్నికలకు వెళ్తోందని కామెంట్ చేసింది. వారసత్వంగా వచ్చిన ఓ నాయకురాలికి ఇలా ప్రమోషన్ ఇస్తున్నారంటూ విమర్శించింది.

దీనిపై ప్రియాంక చతుర్వేది రియాక్టయ్యారు. తన అకౌంట్ లో గజ్వేల్ సభ జనం ఫొటో తీసేసి.. ముందు జరిగిన పొరపాటును సవరించారు. యూపీలో బీజేపీకి తగ్గిపోతున్న క్రేజ్ ను కాపాడుకునేందుకు… సోషల్ మీడియాలో తమను ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు.

 

Latest Updates