ఎమ్మెల్సీ కవిత ప్రచారం చేసిన గాంధీనగర్ లో బీజేపీ విజయం

సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్‌ ఎన్నికల్లో గాంధీనగర్‌ డివిజన్‌ నుంచి విజయం సాధించేందుకు… అధిష్టానం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఇన్‌చార్జీ బాధ్యతలు ఆమెకు అప్పగించింది. కవిత ఇన్‌చార్జీగా ఉన్న డివిజన్‌, స్వయంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ సోదరుడి భార్య పద్మ కావడంతో విజయం తప్పదనుకున్నారు. అయితే.. ఫలితాలు వారి అంచనాలను తారుమారు చేశాయి. దీనికి కారణం గాంధీనగర్‌లో ముఠా పద్మానరేశ్ దారుణంగా ఓడిపోయారు. కల్వకుంట్ల కవిత తానే అభ్యర్థి అన్న స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపించలేదు. మొదటి ప్రచారం, నామినేషన్ మొదలు నుంచి ప్రచారం ముగిసేవరకు కూడా గాంధీనగర్‌ డివిజన్‌ కోసమే కవిత ప్రచారం చేసినా ఆ డివిజన్‌లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి పావని విజయం సాధించారు.

Latest Updates