ట్రాన్స్‌పరెంట్‌ టాక్సేషన్‌తో.. నిజాయితీగా పన్ను చెలిస్తే ఏ భయం అక్కర్లేదు

ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రధాని మెడీ ‘ట్రాన్ప్ పరెంట్ ట్యాక్సేషన్’ అనే కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పన్ను సంస్కరణలను బీజేపీ హృదయ పూర్వకంగా స్వాగతిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు.

“ఇంత కష్ఠకాలంలో కూడా భారీ సంస్కరణలు చేపట్టడం ద్వారా.. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ (సంస్కరణ, సమర్థ పనితీరు, మార్పు) అనే తన అజెండాను అమలు చేసింది మా జాతీయ ప్రభుత్వం. ‘నిజాయితీగా ఉన్న వారిని గౌరవించడం’ అనేది ఈ కొత్త పన్ను విధానం. ఈ విధానం వల్ల పన్నులు నిజాయితీగా చెల్లించే వారికి ఏ సంస్థల నుంచీ వేధింపుల భయం ఉండదు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి మరింత సౌకర్యం, లాభాలు అందుతాయి. వివాదాల్లో మానవ జోక్యం లేకుండా, విచారణ, అప్పీలుకు ప్ర‌ధాని అవకాశం కల్పించారని” ఆయ‌న అన్నారు

ఈ కొత్త సంస్కరణలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు కృష్ణ సాగ‌ర్ రావు. ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించి, డివిడెండ్ పంపిణీ పన్ను రద్దు చేయగా, ఇది వాటికి కొనసాగింపు ప్ర‌క్రియ అని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో వేగంగా సంస్కరణలు చేయడాన్ని బీజేపీ అభినందిస్తోందని తెలిపారు.

Latest Updates