కేజ్రీవాల్ పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఇతనే

నేటితో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కేజ్రీవాల్‌కు పోటీగా బీజేపీ సునీల్ యాదవ్‌ అనే అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడుగా ఉన్న సునీల్ యాదవ్‌ను కేజ్రీవాల్ కు ప్రత్యర్థిగా నిలబెడుతూ సోమవారం రాత్రి బీజేపీ నిర్ణయించింది.

సునీల్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. యాదవ్ వృత్తిరీత్యా న్యాయవాది, సామాజిక కార్యకర్త. సునీల్ తన రాజకీయ జీవితాన్ని యువ మోర్చా ‘మండల అధ్యక్షుడిగా’  ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్,  ప్రధాన కార్యదర్శి, యువ మోర్చా కార్యదర్శి అయ్యాడు. ఆయనకు  ట్విట్టర్‌లో దాదాపు 16,300 మంది ఫాలోవర్లు ఉన్నారు.

70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 8న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

BJP's candidate Sunil Yadav against Arvind Kejriwal in Delhi elections

Latest Updates