డయ్యూ డామన్ లో బీజేపీ తొలి విజయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి విజయాన్ని కౌవసం చేసుకుంది.  డయ్యూ డామన్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్‌.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కేతన్‌ పటేల్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీనే గెలుపొందింది. గత ఎన్నికల్లో కేతన్‌ పటేల్‌పై లాలూభాయ్‌ పటేల్‌ 9,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

 

Latest Updates