బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దంగల్.. రణరంగంలా మారిన కోల్ కతా, హౌరా

  • బీజేపీ లీడర్లపై దాడులకు నిరసనగా చేపట్టిన ‘చలో నబన్నా’ హింసాత్మకం
  •     రణరంగంలా మారిన కోల్ కతా, హౌరా
  •     బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన నిరసనకారులు
  •     టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించిన పోలీసులు
  •     రాళ్లు రువ్విన ప్రొటెస్టర్లు.. పోలీసుల లాఠీచార్జి  

కోల్కతా/హౌరాపశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా రణరంగమైంది. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గురువారం ఆ పార్టీ చేపట్టిన ‘చలో నబన్నా’ ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే సమయంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రోడ్లను బ్లాక్ చేశారు. చాలా చోట్ల టైర్లను కాల్చారు. పక్క జిల్లా హౌరాలోనూ నిర సనలు హింసాత్మకంగా మారాయి. కార్యకర్తలతో పా టు పలువురు సీనియర్ లీడర్లకు గాయాలయ్యా యి.

పర్మిషన్ ఇవ్వని సర్కారు..

బీజేపీ లీడర్లు, కార్యకర్తలపై దాడులు, హత్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రొటెస్టులకు బెంగాల్ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం 100 మందితో శాంతియుత ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. అలానే సెక్రటేరియట్ రెండు రోజులపాటు క్లోజ్ లో ఉంటుందని చెప్పింది. శానిటైజ్ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు కోల్ కతా, హౌరా నుంచి బెంగాల్ సెక్రటేరియట్ ‘నబన్నా’ వరకు ర్యాలీగా బయలుదేరారు. సెక్రటేరియట్ దగ్గర్లోకి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ప్రొటెస్టర్లకు మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. గుంపును చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. బుర్రాబజార్ లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. దిలీప్ తోపాటు పార్టీ నేషనల్ సెక్రటరీ అర్వింద్ మీనన్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మోయ్ సింగ్ మహతో తదితరులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేసేందుకు టైర్లను కాల్చివేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. గొడవ మొదలైన కాసేపటికే మార్కెట్లు, షాపులు మూతబడ్డాయి.

హౌరాలో కూడా..

కోల్ కతాతో పాటు హౌరాలో కూడా ఆందోళనలు జరిగాయి. బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య, బెంగాల్ ప్రెసిడెంట్ సౌమిత్ర ఖాన్ లతో కలిసి వందలాది మంది హౌరా మైదాన్ నుంచి నబన్నాకు ర్యాలీగా బయల్దేరారు. వారిని మల్లిక్ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. ఫుల్ గా లోడ్ చేసిన పిస్తోల్ ను నిరసనకారుల్లో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బీజేపీ కార్యకర్తలు నాటు బాంబులు కూడా విసిరారని అన్నారు. అయితే ఇవి తప్పుడు ఆరోపణలంటూ బీజేపీ ఖండించింది. ఇక సంత్రాన్​గచీలో కూడా ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. దాదాపు రెండు గంటల తర్వాత తమ ప్రొటెస్టును విరమిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ‘‘ఈరోజుకు ఆపేస్తున్నాం. రానున్న రోజుల్లో మళ్లీ కొనసాగిస్తాం’’ అని ఓ లీడర్ చెప్పారు.

ప్రజల విశ్వాసాన్ని మమతా బెనర్జీ కోల్పోయారు. బెంగాల్ లో ప్రజాస్వామ్యం లేదు. బెంగాల్ ఘన కీర్తిని కాపాడేందుకు పార్టీ పోరాటం కొనసాగుతుంది.– బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కార్యకర్తలందరూ మాస్క్ లు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ వేలాది మందితో ప్రొటెస్టులు చేస్తారు. కానీ మాకు సోషల్ డిస్టెన్స్ పాఠాలు చెబుతున్నారు. మాకు అమలయ్యే రూల్సే ఆమెకు వర్తించవా? మా శాంతియుత ప్రదర్శనను హింసాత్మక నిరసనగా మార్చడానికి ప్రయత్నించారు. పోలీసులతో పాటు గూండాలు మాపై రాళ్లు విసిరారు.– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి   కైలాష్ విజయ్ వర్గీయ

దీదీ భయపడ్డారు. అందుకే నబన్నాను మూసేశారు. ఇది బెంగాల్ లో నిజమైన మార్పుకు సంకేతం. దేశభక్తి గల యువకుల వల్లే ఇది సాధ్యమైంది. దేశమే ఈ యువకుల వెంట ఉంది.– బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య

తుపాకీలు, పదునైన ఆయుధాలతో ఉన్న బీజేపీ కార్యకర్త ఆధ్వర్యంలో ‘శాంతియుత ర్యాలీ’ చేపట్టారు. బీజేపీ చేస్తున్న విద్వేష, హింసా రాజకీయాలను బెంగాల్ ప్రజలు అంగీకరించరు. ఇది అసహ్యకరం.– తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి జి.దాస్తిదర్

Latest Updates