మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి BJYM ప్రయత్నం

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల పై CM సమీక్ష చేసినా…ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించారు. విద్యార్థులవి ఆత్మహత్యలు కావని…ఇవి KCR ప్రభుత్వం చేసిన హత్యలని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు BJYM నేతలు. గ్లోబరినా సంస్థను వెనకేసుకొస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి దూసుకెళ్లిన విద్యార్థి నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరో వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు.

 

Latest Updates