బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్

రకరకాల హ్యాష్ ట్యాగ్‌ లతో ఆన్‌‌లైన్ చాలెంజ్‌లను ఈమధ్య రెగ్యులర్ గా చూస్తూ నే ఉన్నాం. అలా ఈమధ్య ట్రెండ్‌ అయిం దే ఈ ‘బ్లా క్‌ అండ్‌ వైట్‌ చాలెంజ్’. ఎప్పుడూ కలర్‌‌ ఫుల్‌‌ ఫొటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫొటోలను ‘womensupportingwomen’ అనే హ్యాష్‌‌ట్యా గ్‌ తో, మహిళలు సోషల్‌‌ మీడియాలో షేర్‌‌ చేయడమే ఈ చాలెంజ్‌ . ఆడవాళ్లు తమలోని ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సత్తా ను పెం పొందించే ఉద్దేశ్యం తో ఈ చాలెంజ్‌ నడుస్తోంది . సెలెబ్రిటీలు కూడా తోడవడంతో ఈ సవాల్‌‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది.

గత కొన్నిరోజులుగా సాదాసీదా మహిళలు, సెలబ్రిటీలు.. ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పోస్ట్​ చేస్తున్నారు. ఒక మహిళగా మిగతా మహిళలకు సపోర్ట్​ చేసేందుకు, తమ సత్తాను లోకానికి చూపించేందుకు ఈ చాలెంజ్ యాక్సెప్ట్​ చేస్తున్నట్లు కూడా పోస్ట్​లో పెడుతున్నారు. రీసెం ట్ గా దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో లేదా సెల్ఫీ పెట్టి, దానికింద ‘హ్యాష్ ట్యా గ్ చాలెంజ్ యాక్సెప్టెడ్’ అనే క్యాప్షన్ ఇస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ని ‘విమెన్ సపోర్టింగ్ విమెన్ ’ పేరుతో పిలుస్తున్నారు.

అసలు ఏంటీ క్యాంపెయిన్ ?

క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు యాభై మూడు లక్షలకు పైగా ఫొటోలు ‘చాలెంజ్ యాక్సెప్టెడ్’ హ్యాష్ ట్యాగ్ తో ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ అయ్యాయి. ఇది పూర్తిగా మహిళలు నడుపుతున్న ఆన్ లైన్ క్యాంపెయిన్. ముందుగా ఒకరు తమ ఫొటోని షేర్ చేసి, తమ స్నేహితులు, బంధువులను నామినేట్ చేస్తారు. వాళ్లు కూడా తమ ఫొటోను పోస్ట్​ చేసి ఇంకొందర్ని నామినేట్ చేస్తారు. ఈవిధంగా ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో చాలెంజ్ వైరల్ అవుతోంది.

సెలబ్రిటీలతో పాపులర్

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో చాలెంజ్ ని అమెరికన్ ఫిల్మ్​ డైరెక్టర్ ఆవా దువర్నే నుంచి హాలీవుడ్ మోడల్ సిండీ క్రాఫోర్డ్ వరకు చాలామంది యాక్సెప్ట్​ చేశారు. అలాగే మన దేశంలో కూడా బాలీవుడ్ హీరోయిన్లు అనుష్కా శర్మ, కత్రినా కైఫ్, అలియా భట్ , సోనమ్ కపూర్, సారా ఆలీఖాన్ , జాన్వీ కపూర్ వంటి ఎంతోమంది యాక్టర్స్ షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ లో నూ కాజల్ , సమంత, రష్మికా మందన్నా, అదా శర్మ, ప్రగ్యా జైశ్వాల్ , ఎమీ జాక్సన్ , రకుల్ ప్రీత్ సింగ్ తమ బ్లాక్‌‌ అండ్‌‌ వైట్‌‌ ఫొటోలను షేర్ చేసి ఇంకొంతమందిని నామినేట్ చేశారు. పొలిటికల్ సెలబ్రిటీ ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా గాంధీతో దిగిన ఫొటోని షేర్ చేసింది. ఇలా సెలబ్రిటీలు ఫొటోస్‌‌ షేర్ చేయడం వల్ల ఈ క్యాంపెయిన్ గురించి చాలామందికి త్వరగా తెలుస్తోంది. వీళ్లతో పాటు ఇంకెంతో మంది మహిళలు ఈ క్యాంపెయిన్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఎక్కడ మొదలైంది?

న్యూయార్క్ టైమ్స్ రిపోర్స్ట్ ప్రకారం గత పది రోజుల క్రితం మొదటి ఫొటోని బ్రెజీలియన్ జర్నలిస్ట్​ అన్నా పౌలా పద్రావ్ పోస్ట్​ చేసింది. దాని తర్వాత చాలామంది మహిళలు తమ ఫొటోలను షేర్ చేసినట్లు రిపోర్ట్​ చెప్తోంది. జెన్ని ఫర్ గార్నెర్, ఈవా లంగోరియా, క్రిస్టెన్ బెల్ వంటి సెలబ్రిటీలు ఇందులో పాల్గొనడంతో ఈ క్యాంపెయిన్ కి ఎక్కు వ ప్రచారం లభించింది. అయితే ఈ చాలెంజ్ టర్కీలో స్టార్ట్​ అయినట్లు మరో ప్రచారం కూడా నడుస్తోంది. ఆ దేశంలో ఫెమిసైడ్ (మహిళల హత్య)కు వ్యతిరేకంగా జనాల్లో అవగాహన కోసం ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టినట్లు చెప్తున్నారు. హత్యకు గురైన మహిళల ఫొటోలను రోజూ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం వల్ల.. ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఛాలెంజ్ స్టార్ట్​ చేసినట్లు ఇన్ స్టాగ్రామ్ లో ఒక మహిళ చెప్పుకొచ్చింది.

Latest Updates