రంగు లేకపోయినా.. రాక్ చేశాడు

Black and White cinema Cold War gets Award

Black and White cinema Cold War gets Awardసినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందుకు తగ్గట్టుగానే తెరపై సినిమాటోగ్రఫీ ఉంటుంది.  ఉండాలనే వాళ్లు ఎందరో. గతేడాది అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫీ(ఏఎస్సీ) అవార్డును గెల్చుకున్న మూవీ బ్లేడ్ రన్నర్–2049 లోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అలా కాదు. దీనికో స్పెషాలిటీ ఉంది. ఎన్నడూ లేనంత నాటకీయత ఈ సారి ఏఎస్సీ అవార్డు ప్రదానోత్సవంలో కనిపించింది. అందరూ అల్ఫన్సో క్యూరాన్ తానే డైరెక్టర్ గా, సినిమాటోగ్రాఫర్ గా తీర్చిదిద్దిన మరో బ్లాక్‌ అండ్‌‌ వైట్‌ సినిమా ‘రోమా’కే ఈ అవార్డు దక్కుతుందని భావించారు. కానీ అది ‘కోల్డ్ వార్’ను వరించింది.

ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేని ప్రేమ కథా చిత్రం కోల్డ్ వార్. పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పావెల్ పావ్లీ
కోవ్ స్కీ ఈ సినిమా తీశారు. లుకాసజ్ జాల్ సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో, ప్రేమికుల మధ్య దృశ్యాలను అద్భుతంగా చూపారు. జాల్ ను ఈ ఏడాది ఏఎస్సీ అవార్డుకు ఎంపిక చేస్తూ 390 మందితో కూడిన ఏఎస్సీ గ్రూపు నిర్ణయించింది. గత ఏడాది బ్లేడ్ రన్నర్–2049 సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజర్ డియాకిన్స్ కు దక్కిం ది. కాగా, రోమా నెట్ ఫ్లిక్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల్లో 4 కేటగిరీల్లో విజేతగా నిలిచింది.
91వ ఆస్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పది కేటగిరీల్లో నామినేట్ అయింది.

Latest Updates