మిరియాలతో బోలెడు లాభాలు

మిరియాలను వంటల్లో రుచికే ఎక్కువగా వాడతాం. అయితే వీటిని  జలుబు, దగ్గుకు మందుగా ఉపయోగించొచ్చు కూడా. ఘాటులోనే కాదు ఔషధ గుణాల్లోను మేటి అయిన మిరియాల వల్ల బోలెడు ఆరోగ్య లాభాలున్నాయి. అందుకే ప్రతిరోజు ఒక గ్లాసు మిరియాల నీళ్లని తీసుకోవాలి.

మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్‌‌, యాంటీ ఆక్సిడెంట్‌‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువ. వీటిలో మెగ్నీషియం, విటమిన్‌‌– కె, ఫైబర్‌‌ మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌‌ల విడుదలను పెంచి, జీర్ణవ్యవస్థ  బాగా పనిచేసేలా చేస్తాయి.చర్మం మీది ముడతలు, నల్లమచ్చలు, గీతలను తగ్గిస్తాయి

మిరియాల్లోని పైపెరిన్‌‌, సెలీనియం, కుర్కుమిన్‌‌, బీటా-కెరోటిన్‌‌, విటమిన్‌‌– బి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, పెద్దపేగు క్యాన్సర్‌‌తో పాటు పలు రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

మిరియాల్లోని  యాంటీ ఆక్సిడెంట్‌‌ లక్షణాలు ఫ్రీరాడికల్స్‌‌ను బయటకు పంపి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గించి, బ్లడ్ ప్రెజర్​ని అదుపులో ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును తగ్గిస్తాయి.

Latest Updates