డొమెక్ నుంచి బ్లేడ్ లెస్​ ఫ్యాన్లు

డొమెక్ సొల్యూషన్స్ ఇండియన్ మార్కెట్‌లోకి సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్లేడ్ లెస్ ఫ్యాన్‌లు విడుదల చేసింది. ఎక్స్ హీల్ కంపెనీ రూపొందించిన ఈ ప్రొడక్ట్‌ను డొమెక్ సొల్యూషన్స్  ప్రైవేట్ లిమిటెడ్‌ తెలంగాణ, ఏపీల్లో అమ్ముతుంది. ఈ ఫ్యాన్లు ఫ్యూచర్ జనరేషన్ ఫ్యాన్లుగా మంచి మార్కెటింగ్‌ను సొంతం చేసుకోనున్నాయని డొమెక్ సొల్యూషన్స్ ఎండీ రఘురామిరెడ్డి,  డైరెక్టర్ రామ కృష్ణారెడ్డి అన్నారు. సాధారణ సీలింగ్ ఫ్యాన్స్‌లా రెక్కలు లేకుండా సీలింగ్‌కు ఒక డిజైన్‌లా ఈ ఫ్యాన్ ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ఫ్యాన్ అన్ చేయగానే రూంలో అప్పటి వరకున్నగాలినంతా అది తీసుకొని దాన్ని శుద్ధి చేసి 360 డిగ్రీల్లో ఆ గాలిని రూంలో సర్క్యూలేట్ చేయటం ఈ ప్రొడక్ట్  ప్రత్యేకత అని చెప్పారు. శుద్ధిచేసిన గాలిని ఇవ్వటమే కాకుండా… ఏసీని కొద్దిసేపు మనకు కావాల్సిన  టెంపరేచర్ లో ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసినా కూడా 8 గంటల వరకు అదే టెంపరేచర్‌‌ ఉంచగలుగుతుందని పేర్కొన్నారు.

Latest Updates