శ్రీలంకలో మళ్లీ బ్లాస్ట్

శ్రీలంకలో బాంబుల మోత ఆగడం లేదు. ఈ ఉదయం మరోసారి బాంబ్ బ్లాస్ట్ ఆ దేశంలో సంచలనం రేపింది. రాజధాని కొలంబో నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని పుగోడా అనే పట్టణంలో శక్తిమంతమైన బాంబు పేలుడు జరిగింది. పుగోడాలో బాంబ్ దాడి జరగడంతో… భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి భధ్రతాబలగాలు వెళ్లాయి. ఈ దాడి గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవాళ శ్రీలంకలో ఆల్ పార్టీ మీటింగ్

గత ఆదివారం కొలంబో, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 8 పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు పేలుళ్లో 359 మంది చనిపోయారు. వరుస బాంబు పేలుళ్ల నుంచి ఆ దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. శ్రీలంకలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుపునిచ్చారు. ఇదేరోజు మరో బ్లాస్ట్ జరిగింది.

Latest Updates