పాకిస్థాన్ లో పేలుడు.. పోలీస్ మృతి

పాకిస్థాన్ లోని క్వెట్టాలో మరో పేలుడు జరిగింది. క్వెట్టాలో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై పోలీస్ వాహనాన్ని టార్గెట్ చేస్తూ బ్లాస్టింగ్ జరిగింది. భారీ శబ్దంతో పేలుడు జరిగేసరికి.. జనం భయంతో పరుగులుపెట్టారు. పోలీస్ ఖలీల్ అహ్మద్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే క్వెట్టా సివిల్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్టు బెలూచిస్థాన్ హోంమంత్రి జియల్లా లాంగో చెప్పారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తామన్నారు. బ్లాస్టింగ్ తో క్వెట్టా సహా ప్రధాన నగరాల్లో బందోబస్తు పెంచారు.

 

 

Latest Updates