అంధులైనా అదరగొట్టారు

పట్టుదలుంటే పర్వతాలెక్కడమూ పెద్ద పనేంకాదని నిరూపించారు ఈ అంధులు. 9 గంటల్లోనే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను ఎక్కేశారు. ఇదేదో ఈ మధ్య జరిగింది కాదు. 1969 ఫిబ్రవరి 20 నాటి కథ ఇది. ఇప్పటికి 50 ఏళ్లు. ఏడుగురు అంధులు, మరో నలుగురు వ్యక్తులతో కలసి టాంజానియాలోని 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారోను అధిరోహించారు. అతి చల్లని వాతావరణం, దానికి తోడు గాలుల బీభత్సం. అయినా పట్టు వదలకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సాహసయాత్రకు సృష్టికర్త జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విల్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. స్వచ్ఛంద సంస్థ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపకుడు. ఆఫ్రికాలోని అంధులకు గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేశాడు.

అంధులకు సరైన శిక్షణనిస్తే అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా చేరకుంటారని చేసి చూపించాడు. యాత్రకు కెన్యా, ఉగాండా, టాంజానియాల నుంచి శారీరకంగా బలంగా ఉన్న వారిని ఎంపిక చేసి రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌, నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంపింగ్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. పర్వతారోహణ వస్తువులను ఎలా ఉపయోగించాలో శిక్ష ణనిచ్చారు. ట్రెక్కింగ్‌ పూర్తయ్యాక వారందరికీ హీరోయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్కమ్‌ లభించింది. ముగ్గురు ట్రెక్కర్ల బూట్లను ఉగాండా మ్యూజియంలో పెట్టింది.

Latest Updates