వైరల్: కొబ్బరి కాయలు కొట్టి గిన్నిస్‌‌ రికార్డు బ్రేక్

వైరల్: కొబ్బరి కాయలు కొట్టి గిన్నిస్‌‌ రికార్డు బ్రేక్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో అడ్వెంచరస్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అందులోనూ రికార్డులకు గీటురాయిగా నిలిచే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్) వీడియోలకు మస్తు వ్యూస్ వస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ పి.ప్రభాకర్ రెడ్డి తన స్టూడెంట్స్‌‌ బోయిల్ల రాకేశ్‌‌తో కలసి చేసిన కొబ్బరి కాయల స్టంట్‌‌ నెట్‌‌లో వైరల్ అవుతోంది. సదరు స్టంట్‌‌లో రాకేశ్ కింద పడుకోగా అతడి చుట్టూ పదుల టెంకాయలను ఉంచారు. ప్రభాకర్ రెడ్డి కళ్లపై ఉప్పు వేసి గంతలు కట్టారు. ప్రభాకర్ తన చేతిలో సుత్తె పట్టుకొని రాకేశ్ చుట్టూరా ఉన్న కొబ్బరి కాయలను పగుల కొట్టారు. అలా పగిలిన టెంకాయలను దగ్గర్లో ఉన్న పశువులు, కోతులు, కుక్కలకు తినిపించడం గమనార్హం. ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ ద్వయం కలసి 49 కొబ్బరి కాయలను పగులగొట్టారు. దీంతో ఇంతకుముందు ఈ ఫీట్‌‌కు సంబంధించి ఉన్న 35 కొబ్బరి కాయల రికార్డును బ్రేక్ చేశారు. సోషల్ మీడియాలో జీడబ్ల్యూఆర్ షేర్ చేసిన ఈ వీడియోకు 6.5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆలస్యమెందుకు ఈ సాహసాన్ని మీరూ చూసేయండి.

Most Coconuts Smashed Around A Person Blindfolded In One Minute – Guinness World Records

Would you trust anyone enough to do this? ??

Guinness World Records यांनी वर पोस्ट केले सोमवार, १२ ऑक्टोबर, २०२०