సోషల్ మీడియాలో సర్జికల్ స్ట్రైక్: దడుసుకున్న పాకిస్తాన్

సోషల్‌ మీడియాలో గత మూడు, నాలుగు రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు అన్షుల్‌ సక్సేనా. నెట్టిజన్స్‌ అతన్నో హీరోగా అభివర్ణిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మొదట ప్రతీకార చర్యను మొదలుపెట్టింది ఇతగాడే కాబట్టి. తనకు తెలిసిన టెక్నికల్‌ నాలెడ్జ్‌ ద్వారా పాక్‌ వెబ్ సైట్లు కొన్ని హ్యాక్‌ చేసి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశాడు. అంతేకాదు దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న కొందరి వ్యవహారాన్ని బయటపెడుతున్నాడు కూడా.

బాక్స్‌ బద్దలయ్యే ఆన్సర్‌…
పుల్వామా దాడి తర్వాత అన్షుల్‌ పాక్‌ వెబ్ సైట్లను హ్యాక్‌ చేస్తానని ఓ పోస్ట్‌ చేశాడు. దానికి బదులుగా పాక్‌ హ్యాక్‌ వెబ్ సైట్‌ ఒకటి స్పందించింది. ‘నువ్వొక బచ్చాగాడివి. పాత ట్రిక్స్ తో ఏం చేయలేవంటూ’ బదులిచ్చింది. దానికి అన్షుల్‌ కౌంటర్‌ ఏ రేంజ్ లో ఉందంటే… ఆ అకౌంట్ నే డిలీట్‌ చేసి పడేశాడు. ఆ తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (లాహోర్) తో పాటు ఐదు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్ సైట్స్ ను హ్యాక్ చేశాడు. అదే సమయంలో మన దేశం సైబర్‌ సెక్యూరిటీ కోసం పని చేయాలని యువతకు అన్షుల్‌ పిలుపు ఇచ్చాడు. దీంతో మరికొందరు యువకులు కూడా రంగంలోకి దిగారు. పాక్‌ అధికారిక వెబ్ ట్లను వరుసబెట్టి హ్యాక్‌ చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ వెబ్ సైట్ హ్యాక్ అయింది. దెబ్బకు పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ ఫోటోను వెబ్ సైట్ నుంచి తొలగించే స్థాయికి మన సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేరుకుంది.

దేశద్రోహులను తెరపైకి…
దేశానికి, జవాన్లకు వ్యతిరేకంగా పోస్టులు చేసే వాళ్లకు ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు అన్షుల్‌. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేస్తున్నాడు. స్వయంగా అధికారులకు తానే ఫిర్యాదు చేస్తున్నాడా యువకుడు. చర్యలు తీసుకుంటున్న అధికారులు అతనికి బదులిస్తున్నారు కూడా. టెర్రరిస్టులపై సోషల్ మీడియా ద్వారా సానుభూతి చూపుతున్న వాళ్ల ట్వీట్స్, ఫేస్ క్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తనకు పంపించాలని, తన ఈ మెయిల్‌కు పంపించాలని కోరుతున్నాడతను.

అతనికిది మామూలే…
కోల్‌కతాకు చెందిన అన్షుల్‌ ఒక పర్సనల్‌ బ్లాగర్‌. పొలిటికల్‌ కామెంటేటర్‌ కూడా. రాజకీయ అంశాలపై, దేశంలో జరిగే ప్రధాన ఘట్టాలపై కుల్లం ఖుల్లాగా తన అభిప్రాయాన్ని చెప్తాడు. గతంలో కాంగ్రెస్‌, టీఎంసీ పార్టీల వెబ్ సైట్లను హ్యాక్‌ చేసి చిక్కులు ఎదుర్కొన్నాడు కూడా. పాకిస్థాన్‌ వెబ్ సైట్లను హ్యాక్‌ చేయడం అతనికి చాలా మామూలు విషయం.

Latest Updates