బ్రెయిన్‌లో బ్లెడ్ క్లాట్.. ఇండియాకు రాకుండా అడ్డుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా: మెదడులో రక్తం గడ్డకట్టడంతో జార్జియా నుంచి తల్లిదండ్రుల వద్దకు బయలుదేరిన యువతిని ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. భువనగిరికి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్ళింది. అక్కడ కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో శివాణి వాంతి చెసుకొని అపార్మరక స్థితిలోకి వెళ్ళింది. అది గమంచిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివాణికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్లు తెలిపారు. వెంటనే ఆమె తోటి విద్యార్థులు శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు ఆరోగ్యం పరిస్థితి తెలిసి ఆమె తల్లిదండ్రులు ఎంతో బాదపడ్డారు.

శివాణిని హైదరాబాద్ రప్పించి మెరుగైన చికిత్స చేయించాలని వారు భావించారు. అందుకోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో శివాణి జార్జియా నుంచి హైదరాబాద్ రావడానికి జార్జియా ఎయిర్ ఫోర్ట్‌కు చేరుకుంది. అంతాసాఫీగా సాగుతున్న ఈ సమయంలో.. శివాణి బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లగా.. కరోనా వైరస్ నేపథ్యంలో శివాణి హైదరాబాద్ వెళ్లడానికి ఎయిర్ ఫోర్ట్‌ సిబ్బంది నిరాకరించారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కూతురును రక్షించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అక్కడి అధికారులు ఆమెను అడ్డుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడి అధికారులతో మాట్లాడి తమ కూతురు ఇండియాకు వచ్చేలా చూడాలని శివాణి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

For More News..

ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

Latest Updates